మంచి దేశభక్తి సినిమా ఎదైనా చూసినపుడు, ఆ క్షణాన మనమూ సైన్యంలో చేరి ఎదో పీకేయాలని అనిపిస్తుంది, అటువంటిది మొత్తం జాతి గర్వించదగ్గ విషయం చోటుచేసికొనినపుడు ఆ దేశంలో పుట్టినందుకు గర్వంగా అనిపించుటలో ఆశ్చర్యం ఎంతమాత్రమూ లేదు. ఈ అనుభూతి మనస్సున కలుగుటకు గొప్ప ప్రేరణ నిన్న చోటుచేసుకొనిన సంఘటన, అది ఏమిటి అని నేను ప్రత్యేకంగా ఇక్కడ ప్రస్తావించనక్కర్లేదు, అయినా చెప్తాను, ఆ చోటు చేసుకొనిన సంఘటన 'క్రికెట్' లొ. అది ఒక సాదారణ ఆట అయి ఉండవచ్చు, కాని ఆ సాదారణ ఆటను ఇష్టపడే వారు నూట ఇరవై కోట్ల మంది. ఇది సాదారణ సంఖ్య ఎంత మాత్రమూ కాదు.
మన సచిన్ మరియు ఎంతో మంది చిరకాల స్వప్నమైన ప్రపంచకప్పును సాధించి ఇంత మందిని సంతోషంతో ఉద్విఘ్నతకు లోనయేలా చేసిన మన దేశ క్రికెట్ జట్టు కి జేజేలు.
ఇప్పటికి సరిగ్గా ఇరవై నాలుగు గంటల క్రితం చోటుచేసుకొనిన ఈ సంఘటన భవిష్యత్తులో పునరావ్రుతమవ్వాలని కోరుతూ, ఇటువంటి చిరస్మరణీయ విజయాలు సుస్తిరం కావాలని కోరుకుంటూ,
ఓ చిన్న, ఆ సదరు ఆట అభిమాని
Sunday, April 3, 2011
జగమెరిగే విజయం
Posted by bharath at 11:25 PM
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment