Thursday, February 18, 2010

చరిత్ర లో కనువిప్పు కలిగిన ఓ రోజు

"మడిసి ఎంత తింగరోడైన వాడు చేసే మంచి పనులను గుర్తుంచుకోవాలి" అని శ్రీ శ్రీ భగవత్ అనే మహానుభావులు అన్నట్లు నిన్ననే ఓ ఆర్కుట్ ప్రొఫైల్ లో చూసాను. ఆ వాక్యన్ని అవలోకన చేసుకుంటూ మనకు తెలిసి మంచి పని చేసిన తింగరోళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తుండగ సారి జరిగిన సంఘటన స్పురణకు వచ్చింది.

నాకున్న స్నేహితులలో ఒకడు కిషోర్, వాడు ఎంత గొప్పవాడంటే అదేదో వ్యాపారప్రకటన లో సెలవిచ్చినట్లు పిల్లిని చంకనవేసుకొని ఊరంతా వెతుకులాడేఅంత గొప్పవాడు, ఇలా మా వాడి ఘనకార్యాలకు పుస్తకరూపమిస్తే అది రామాయణ మహాకావ్యమంత పెద్ద గ్రంధం అవుతుందేమొ.......

ఈ ఉపొద్గాతం ఆపేసి అసలు విషయానికి వస్తే, ఓ సారి మేము ఇద్దరం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఒ కుక్కపిల్ల చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ చినచిన్నగా నడుస్తూ పట్టుతప్పి పక్కగ ఉన్న కాలువలో పడింది. దాన్ని పైకి లాగాలని నేను అనుకునేంతలోపె మావాడు వెళ్ళి పైకి లాగేసి దాన్ని కాపాడాడు.

ఆ సంఘటన తర్వాత నాకు తెలిసొచ్చిన నీతులు ఏంటంటే, మంచి పని ఎదైనా చేయవలసివచ్చినపుడు మితిమీరిన ఆలోచన పనికిరాదు, మంచి ఆలోచనలు ఉంటే సరిపోదు వాటిని ఆచరణలో పెట్టకపోతే వౄధ, ఇంకొక విషయం ఎమిటంటే ప్రతి విషయానికి initiation మన నుంచి రావటం అనేది మన ఎదుగుదలలో ఎంతో ఉపకరించే విషయం.
ఇకడ కిషోర్ మామూలుగా తింగరోడే అయినా initiation తీసుకుని కుక్క పిల్ల ప్రాణాలు కాపాడాడు, ఒక నిమిషం ఆలస్యం చేసుంటే అది స్ప్రుహ కూడా కోల్పోయిఉండొచ్చు.

కాబట్టి ఉపసమ్హారం ఏమిటంటే, ఎవరి చేతనో చెప్పబడినట్లు నేను మొదట చెప్పిన వాక్యమే. ఇది నిజంగా ఆచరణీయమైనది అనుటలో సందేహమేలేదు

1 comments:

bujji said...

మీ కొత్త బ్లాగు బాగుంది భారత్ గారు. త్వరగా రాస్తే త్వరగా చదివేస్తాం :)