పన్నెండు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఒకటి చెపుతాను, ఇది చెన్నపట్నమని మన పెద్దలు ఎంతో ఇష్టంగా పిలుచుకునే చెన్నై కి వెళుతుండగ జరిగింది.
అవి వేసవిసెలవలు కవడంతో అమ్మ చెన్నై కి వెళ్ళాలని ప్లాన్ వెసింది, అలానే ఓ సాయంత్రం చెన్నైకని బస్సులో బయలుదేరాము. బస్సు నెల్లూరు దాటుతుండగ సూర్యుడు కూడా చిన్నగా కిందకు జారుకున్నాడు, నేను కిటకీ ప్రక్కన ఉన్న సీటులో కూర్చుని బయటకేసిచూస్తూఉన్నాను, ప్రపంచం నుండి దూరంగా పడేసినట్లు దరిదాపులలో అంతా చీకటిగా ఉన్న ఆ రోడ్డు కేసి చూస్తూ (భారతదేశ ముఖ్యపట్టణాలను కలుపుతూ ఉండే ఓ నాలుగు జాతీయరహదారులను ఎంతగానో ఆధునీకరించి గోల్డెన్ క్వాడ్రిలేటరల్ గా ఇపుడు పిలుస్తున్నారు, ఈ మార్గము అప్పటికి మామూలుగానే ఉంది) చిన్నగా కలలలోకి జారుకున్నాను, ఆ కలలో హీరో నేనే, హీరో అంటే ఊరికే ఉండకూడదు కదా, విలన్ ని కొట్టాలి, అలానే కొట్టాను. ఇంకా హీరోయిన్ కూడా ఉండాలి కదా, ఉంది(ఆ రోల్ ని శ్రీదేవి పోషించిందిలే), విలన్ ని కొట్టి చివరికి నేను నెగ్గి ఇంకా కల continue అవుతుండగా ఎదో శబ్దం వచ్చి నిద్రలేచాను, బస్సు ఆగివుంది, ఎవరో నలుగురు వ్యక్తులు ఎక్కారు, బస్సు మామూలుగానే కదిలేసింది, మళ్ళీ నేను నిద్ర లోకి జారుకుంటుండగా ఆ నలుగురు ఒక్కసారిగా లేచి కత్తులు చూపుతూ మా అందరిదగ్గరా ఉన్న డబ్బులు యివ్వమని అరిచారు, ఆ నలుగురిలో ఒకడు నడిచే క్రమంలో ఓ బ్యాగు అడ్డుపడటంతో పట్టుతప్పి కిందపడ్డాడు, వాడిని లేపే క్రమంలో ఒకడు, వారిద్దరిని చూస్తూ మరొక ఇద్దరూ ఉండిపోయారు, ఇంతలో ఓ ఇద్దరు ప్రయాణికులు దైర్యం చేసి తేరుకొని నించొని ఉన్న ఇద్దరు దొంగల్నితోసారు, వారు కిందపడ్డారు, దీనితో దైర్యం తెచ్చుకున్న మిగిలిన ప్రయాణికులు దొంగలపై ఎదురు తిరిగారు, నేను ఎందుకు ఊరకనే ఉండాలి అని నేను లేవబోయాను, ఇంతలో అమ్మ చూసి "ఒరేయ్! అదనప్రసంగిలా లేస్తున్నావేంటి, కూర్చో" అని అనేసరికి కూర్చుండిపోయాను. చివరికి మా ప్రయాణికులదే పైచేయి అయేసరికి దొంగలు ఊరకుండిపోయారు, ఆ ఇద్దరు ధీరోద్దాతులను పొగడ్తలలో ముంచెత్తారు.
కలలుకని వాటిని నిజం చేసుకొండి అని ఓ మహానుభావుడు చెప్పాడు, కాని ఇక్కడ నా ప్రమేయం లేకుండానే నాకొచ్చిన కల అటూఇటుగా నిజం అయిపోయింది.
Friday, February 26, 2010
కలలే నిజమైతే
Posted by bharath at 4:51 PM 0 comments
Thursday, February 18, 2010
చరిత్ర లో కనువిప్పు కలిగిన ఓ రోజు
"మడిసి ఎంత తింగరోడైన వాడు చేసే మంచి పనులను గుర్తుంచుకోవాలి" అని శ్రీ శ్రీ భగవత్ అనే మహానుభావులు అన్నట్లు నిన్ననే ఓ ఆర్కుట్ ప్రొఫైల్ లో చూసాను. ఆ వాక్యన్ని అవలోకన చేసుకుంటూ మనకు తెలిసి మంచి పని చేసిన తింగరోళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఆలోచిస్తుండగ ఓ సారి జరిగిన సంఘటన స్పురణకు వచ్చింది.
నాకున్న స్నేహితులలో ఒకడు కిషోర్, వాడు ఎంత గొప్పవాడంటే అదేదో వ్యాపారప్రకటన లో సెలవిచ్చినట్లు పిల్లిని చంకనవేసుకొని ఊరంతా వెతుకులాడేఅంత గొప్పవాడు, ఇలా మా వాడి ఘనకార్యాలకు పుస్తకరూపమిస్తే అది రామాయణ మహాకావ్యమంత పెద్ద గ్రంధం అవుతుందేమొ.......
ఈ ఉపొద్గాతం ఆపేసి అసలు విషయానికి వస్తే, ఓ సారి మేము ఇద్దరం రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఒ కుక్కపిల్ల చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ చినచిన్నగా నడుస్తూ పట్టుతప్పి పక్కగ ఉన్న కాలువలో పడింది. దాన్ని పైకి లాగాలని నేను అనుకునేంతలోపె మావాడు వెళ్ళి పైకి లాగేసి దాన్ని కాపాడాడు.
ఆ సంఘటన తర్వాత నాకు తెలిసొచ్చిన నీతులు ఏంటంటే, మంచి పని ఎదైనా చేయవలసివచ్చినపుడు మితిమీరిన ఆలోచన పనికిరాదు, మంచి ఆలోచనలు ఉంటే సరిపోదు వాటిని ఆచరణలో పెట్టకపోతే వౄధ, ఇంకొక విషయం ఎమిటంటే ప్రతి విషయానికి initiation మన నుంచి రావటం అనేది మన ఎదుగుదలలో ఎంతో ఉపకరించే విషయం.
ఇకడ కిషోర్ మామూలుగా తింగరోడే అయినా initiation తీసుకుని కుక్క పిల్ల ప్రాణాలు కాపాడాడు, ఒక నిమిషం ఆలస్యం చేసుంటే అది స్ప్రుహ కూడా కోల్పోయిఉండొచ్చు.
కాబట్టి ఉపసమ్హారం ఏమిటంటే, ఎవరి చేతనో చెప్పబడినట్లు నేను మొదట చెప్పిన వాక్యమే. ఇది నిజంగా ఆచరణీయమైనది అనుటలో సందేహమేలేదు
Posted by bharath at 1:16 PM 1 comments
Wednesday, February 10, 2010
ఒక పేరు - ఒక చరిత్ర
నా పేరు ఇపుడు ఇలా ఉంది కదా, అసలు భరత్ అనబడే నా చరిత్ర లోకి వెళితే మొదట అనుకున్న పేరు ఇది కాదు. ' భరత్ ' అని కాకుండ ' బౄంద ' అని పెట్టాలని అనుకున్నారట, కొన్ని రోజులు ఆపేరే వ్యవహరంలో ఉంది కూడ, కాని అమ్మ కి ఆ పేరు అసలు నచ్చక భరత్ అనే పేరుని ముందుకు తీసుకువచ్చిందట. చివరికి నాన్నారికి కూడ ఆ పేరు నచ్చేయటంతో ఇక అది అలా స్తిరపడిపోయింది.
ఇక నా పేరులోని రెండో సగంలోకి వెళితే, అదేనండి 'ద్వారకనాద్', ఇది పెట్టటానికి కారణం, మా ఇంట్లో 'సాయిబాబా' ని ఇష్టం గా కొలవటమే. ఇంతకీ 'సాయిబాబా' కి 'ద్వారక ' అనే పేరుకు ఉన్న సంభందం అందరికి తెలిసిందేకద.
' భరత్ ' అనే పేరు అలా ఉండిపోవటం కూడ మంచిదేనేమొ, ఎందుకంటే భవిష్యత్తులో తెల్లమొహాల మద్యకు వెళితే, నాకు ముందు అనుకున్న పేరు సంస్కౄత పదం ఆ పదాలను వాళ్ళు పలకలేరు, పలికేందుకు ప్రయత్నించినా వారికి అవి నోరు తిరగవు, అలా తిరగక నా పేరుని ఎలా ఐనా పలకాలనే ఆత్రంలో విరగదీసి అరగదీసి హత్య చేసేస్తారు, అంత నరకాన్ని అపుడు నేను అనుభవించకుండ అమ్మ మంచిపనే చేసింది.
thanQ mummy :)
Posted by bharath at 3:25 PM 0 comments
Friday, February 5, 2010
భరత్ ద్వారకనాథ్
నా ఈ పేరు వినటానికి ఎలా అనిపిస్తుంది అనే సందేహం నాకు మొదటి నుంచి వుండేది, ఈ సందేహం కాసేపు అలా పక్కనపెడితే నాకు ఈ పెరే ఎందుకు పెట్టారబ్బా అనే సందేహం కూడా ఉండేది. నిజానికి ఆ పేరు పెట్టడం వెనక మంచి కదేవుంది, నీ పేరు పెట్టడం గురించిన కధ నీకెలా తెలుసురా బడుధాయ్ అని అడగాలని అనిపిస్తోందా? ఎలా అంటే,
మనం పెద్ద సందేహప్రాణులం అన్న సందేహం మీకు యిప్పటికే వచ్చెసి ఉంటుంది, నేను ఐతే అమ్మ వాళ్ళని బాగా విసుగుపుట్టించిమరీ తెలుసుకున్న ఆ కధ మొత్తం, అలానే నా సందేహాన్నికూడ.
ఆ కధకమామిషు ఏంటంటే
తదుపరి టపా లో చెప్తాను :)
Posted by bharath at 1:41 PM 0 comments