"ఈ ప్రాంతానికి కొత్త వాడిలా ఉన్నావ్, లోకల్ వాళ్ళతో జాగ్రత్తగా, మంచిగా మసలటం నేర్చుకో", అనేటటువంటి మాటలను కళాశాలలలో కొత్తగా చేరిన రోజులలో మనం వింటుంటాము. 'లోకల్' అనే భావన అక్కడ ఎంత సరదాగా తీసుకున్నా నిజానికి 'ఇది నేను పెరిగిన ప్రాంతము, ఈ ప్రాంతము నాది ' అనే భావన మనసులో మెదలినపుడు ఎంత భవనాప్రేరితులమౌతామొ చెప్పవలసిన అవసరమే ఉండదు. అటువంటి సొంత ఊరిని లేక ప్రదేశాన్ని, ఆ అలవాటుపడిన వాతావరణమును విడచి వెళ్ళవలసిన పరిస్తితి వచ్చినపుడు ఈ యాంత్రిక జీవితము కొరకు ' మన ' అనునటువంటివాటిని త్యజించుటకు మనసు అంత సులువుగా ఒప్పుకొనదు.
ఈ పరిస్తితిని ఎన్నో సినిమాలలో చక్కగా వివరించివున్నారు, వాటిలో ఒకటి తమిళంలో 'పడయప్ప ' గా విడుదలై తెనుగులోకి అనువదించబడిన 'నరసింహా'. ఇందులో మహా నటులు శివాజీ గనేశన్ నటించిన పాత్ర తను పుట్టి పెరిగిన ఇంటితో ఎంతో అనుబందం ఏర్పరచుకుంటాడు, చివరికి ఆ ఇంటిని వదిలి వెల్లవలసి వచ్చినపుడు బాగా బాధకు లోనై, దానిని తాళలేక చివరికి తనువు చాలిస్తారు.
ఉపసంహారం: ఈ టపాకు శంఖుస్తాపన నిజానికి ఏడు నెలల క్రితం జరిగింది, ఎందుకనో పూర్తి చేయకుండా అలాగే వదిలేసా, తీరా ఇపుడు చూస్తే ఇది లోకదర్శనానికి నోచుకోకుండా అలాగే పడిపొయివుంది, జాలి వేసి చక చకా ఉపసంహారం రాసి ఈ 2011 ఏప్రల్ 4న పూర్తి చేసా.........అమ్మయో! :)
Friday, September 3, 2010
'నా'
Posted by bharath at 1:13 PM 0 comments
Subscribe to:
Comments (Atom)